గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్
గోదారి గట్టు మీద
రామ సిలకవే…తెలుగు లిరిక్స్
భాస్కర భట్ల అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీత స్వరకల్పనలో రమణ గోగుల మరియు మధుప్రియ పాడిన ఈ పాట ‘సంక్రాంతికి వస్తున్నాం‘ చిత్రంలోనిది. రమణ గోగుల చాలా కాలం తరువాత ఈ పాట ద్వారా మైక్ పట్టిన విషయం తెలిసిందే. సినిమా సూపర్ హిట్ టాక్ రావడంలో పాటలు సంగీతం ముఖ్యపాత్ర పోషించాయి. యూట్యూబ్ లో దూసుకుపోతున్న పాట లిరిక్స్ మీకోసం.
Godari Gattu Meeda Song Lyrics Credis
సంక్రాంతికి వస్తున్నాం
Movie Released Date – 14 January 2025
Director : Anil Ravipudi
Producer : Shirish
Singers : Ramana Gogula, Madhupriya
Music : Bheems Ceciroleo
Lyrics : Bhaskara Bhatla
Star Cast : Venkatesh, Meenakshi Chaudhary, Aishwarya Rajesh
Music Label : T-Series Telugu
తరరిరరారే రరరా
తరరిరరారే రరరా
గోదారి గట్టు మీద
రామ సిలకవే…
ఓ ఓ, గోరింటా కెట్టుకున్న
సందమామవే…
గోదారి గట్టు మీద
రామ సిలకవే
గోరింటాకెట్టుకున్న
సందమామవే
ఊరంతా సూడు ముసుగే తన్ని
నిద్దరపోయిందే…
ఆరాటాలన్నీ తీరకపోతే
ఏం బాగుంటుందే…
నాకంటూ ఉన్నా ఒకే ఒక్క
ఆడ దిక్కువే…
నీతోటి కాకుండా
నా బాధలు ఎవరికి
చెప్పుకుంటానే..!
గోదారి గట్టు మీద
రామసిలకనే…
ఆ ఆ, గీ పెట్టి గింజుకున్నా
నీకు దొరకనే…
హేయ్, విస్తరి ముందేసి
పస్తులు పెట్టావే…
తీపి వస్తువు చుట్టూ తిరిగే
ఈగను చేసావే…
ఛీ ఛీ ఛీ సిగ్గే లేని
మొగుడు గారండోయ్
గుయ్ గుయ్ గుయ్ గుయ్ మంటూ
మీదికి రాకండోయ్..!
ఒయ్ ఒయ్
గంపెడు పిల్లల్తో
ఇంటిని నింపావే
సాప దిండు సంసారాన్ని
మేడెక్కించావే…
హుఁ, ఇరుగు పొరుగు ముందు
సరసాలొద్దండోయ్…!
గురకెట్టి పడుకోరే
గూర్కాల్లాగా మీ వాళ్ళు
ఏం చేస్తాం ఎక్కేస్తాం
ఇట్టాగే డాబాలు…
పెళ్ళై సాన్నాల్లే
అయినా కానీ మాస్టారు
తగ్గేదే… లేదంటూ
నా కొంగెనకే పడుతుంటారు.
హేయ్, గోదారి గట్టు మీద
రామ సిలకవే
గోరింటాకెట్టుకున్న సందమామవే
హేయ్ హేయ్
హుఁ హుఁ
లలలాల లాల
హుఁ హుఁ
హె హె హేయ్
హో హో హోయ్
లలలాల లాల
హుఁ హుఁ
మ్ మ్……….
కొత్త కోకేమో… కన్నే కొట్టిందే
తెల్లారేలోగా తొందర పడమని
చెవిలో చెప్పిందే…
ఈ మాత్రం హింటే ఇస్తే
సెంటే కొట్టెయ్‍నా
ఓ రెండు మూరల మల్లెలు
చేతికి చుట్టెయ్‍నా
ఈ అల్లరి గాలేమో
అల్లుకుపొమ్మందే
మాటల్తోటి కాలక్షేపం
మానెయ్ మంటుందే
అబ్బబ్బా కబడ్డీ కబడ్డీ
అంటూ కూతకు వచ్చెయ్‍నా?
ఏవండోయ్ శ్రీవారు
మళ్లీ ఎపుడో అవకాశం
ఎంచక్కా బాగుంది
చుక్కల ఆకాశం
హెయ్, ఓసోసి ఇల్లాలా
బాగుందే నీ సహకారం
ముద్దుల్తో చెరిపేద్దాం
నీకు నాకు మధ్యన దూరం
గోదారి గట్టు మీద
రామసిలకనే
హుఁ, లలలా
హా, నీ జంట కట్టుకున్న
సందమామనే…
హుఁ, లలలా
తరరిరరారే రరరరా
తరరిరరారే రరరా
Comments
Post a Comment