గోదారి గట్టు మీద రామ సిలకవే…తెలుగు లిరిక్స్

Song Name | Prema vennela |
Singer | Sudharshan Ashok |
Composer | Devi Sri Prasad |
Lyrics Writer | Sri mani |
Music | Devi Sri Prasad |
రంగు రంగు పువ్వులున్న
అందమైన తోటలో
ఇప్పుడే పూసిన కొత్తపువ్వులా
ఏడు రంగులొక్కటై… పరవశించు వేళలో
నేలకే జారిన కొత్త రంగులా
వానలా వీణలా… వానవీణ వాణిలా
గుండెలో పొంగిన కృష్ణవేణిలా
ఒంటరి మనసులో… ఒంపి వెళ్ళకే అలా
సరిగమల్ని తియ్యగా ఇలా
ప్రేమ వెన్నెలా… రావె ఊర్మిళా
ప్రేమ వెన్నెలా… రావె ఊర్మిళా
రంగు రంగు పువ్వులున్న
అందమైన తోటలో
ఇప్పుడే పూసిన కొత్తపువ్వులా
ఏడు రంగులొక్కటై… పరవశించు వేళలో
నేలకే జారిన కొత్త రంగులా
ఊ.. దిద్దితే నువ్వలా కాటుకే కన్నుల
మారదా పగలిలా అర్థరాత్రిలా
నవ్వితే నువ్వలా మెల్లగా మిలమిలా
కలవరం గుండెలో కలతపూతలా
రాయలోరి నగలలోంచి
మాయమైన మణులిలా
మారిపోయెనేమో నీ రెండు కళ్ళలా
నిక్కమైన నీలమొకటి
చాలు అంటూ వేమన
నిన్నుచూసి రాసినాడలా
ప్రేమ వెన్నెలా…రావె ఊర్మిళా
ప్రేమ వెన్నెలా…రావె ఊర్మిళా
ఆ ఆ నడవకే నువ్వలా
కలలలో కోమలా
నడవకే నువ్వలా
కలలలో కోమలా
పాదమే కందితే మనసు విలవిలా
విడువకే నువ్వలా… పలుకులే గలగలా
పెదవులే అదిరితే గుండె గిలగిలా
అంతులేని అంతరిక్షమంతు చూడకే అలా
నీలమంత దాచిపెట్టి వాలుకన్నులా
ఒక్కసారి గుండెలోకి అడుగుపెట్టి రా ఇలా
ప్రాణమంత పొంగిపోయేలా
ప్రేమ వెన్నెలా… ప్రేమ వెన్నెలా
రావె ఊర్మిళా… రావె ఊర్మిళా
ప్రేమ వెన్నెలా… ప్రేమ వెన్నెలా
రావె ఊర్మిళా
Comments
Post a Comment